అన్నదమ్ముల వలే కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి కోసం పని చేద్దాం

తల్లి ని వదిలేసి అత్తారింటికి వెళ్ళి వస్తున్నట్టు ఉంది

గ్రామాభివృద్ధి గురించి గతంలో బిఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది కాని అధికారం కోసం కాదు 

ఎల్లారెడ్డిపేట తాజా  మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): మన మందరం   అన్నదమ్ముల వలే కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి కోసం పని చేద్దామని  ఎల్లారెడ్డిపేట తాజా  మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అన్నారు, 

బిఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎల్లారెడ్డిపేట తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి ని మాజీ ఉప సర్పంచ్ ద్యాగం లక్ష్మీనారాయణ ను, బి ఎస్ పి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎడ్ల రాజకుమారులను ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు  శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు,

ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 

తల్లి లాంటి  కాంగ్రెస్ పార్టీ ని వదిలేసి  అత్తారింటికి  వెళ్ళి వస్తున్నట్టు బిఆర్ ఎస్ పార్టీ నుంచి వచ్చినట్లు  ఉందన్నారు,

కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో  తాను గతంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్  ఉమ్మడి  జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగిందన్నారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఆదేశాల మేరకు  గతంలో కోనరావుపేట స్థానిక సంస్థల  ఎన్నికల ఇన్చార్జిగా కూడా పనిచేయడం జరిగిందన్నారు , 

ఏ పార్టీ  అధికారంలోకి వస్తే ఆ పార్టీ లోకి వెళుతున్నారని వస్తున్నారని   కొందరు  వ్యక్తులు  అంటున్నారు కానీ తాను    గ్రామాభివృద్ధి గురించి గతంలో బిఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది కాని అధికారం కోసం కాదన్నారు , 

తాను  బిఆర్ ఎస్ పార్టీ కోసం పది సంవత్సరాలుగా కష్టపడి స్వంత డబ్బు లు ఖర్చు పెట్టుకొని   పని చేసినా  మాజీ మంత్రి కేటీఆర్ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని  బిఆర్ ఎస్  పార్టీ లో గౌరవం లేదని స్వేచ్ఛ లేదని పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు,

వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరాలనుకునే కార్యకర్తలను నాయకులను పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకాలనీ   పాతా కొత్త కలయిక తోనే కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు,

అందుకు కాంగ్రెస్ పార్టీ ‌గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంచాలన్నారు, 

కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా  గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  , మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్పు జిల్లా అధ్యక్షులు వేములవాడ

శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ల 

రిసీవ్ సంతృప్తికరంగా ఉందన్నారు,

బి.ఎస్.పి కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎడ్ల రాజ్ కుమార్ మాట్లాడుతూ

తోను బీఎస్పీ పార్టీలో సాధారణ  కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి  పదవిలో పనిచేయడం జరిగిందన్నారు

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు,

ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి మండల స్థాయి  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

.