తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలంలోని ఎత్తోండ, యాద్గర్ పూర్ గ్రామాలలో కోటగిరి మండల జనరల్ సెక్రెటరీ విలాస్, బూత్ అధ్యక్షుడు బోధన్ హన్మంతు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ మేనిఫెస్టో పై జోరుగా ప్రచారం నిర్వహించారు.వారు మాట్లాడుతూ... దేశంలో గత 10 ఏండ్లుగా నరేంద్రమోదీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులు నరేంద్ర మోడీని యూనివర్సిల్ లీడర్ గా మార్చాయని పేర్కొన్నారు.మోడీ పరిపాలన దక్షతతో దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వాన్ని యువకులు, ఓటర్లు బలపరుస్తూరన్నారు. ప్రతి ఒక్కరు కమలంకు ఓటేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు. మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని బిజెపి నాయకులు కార్యకర్తలు దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, శ్యామ్ సుందర్, జగదీష్ , వాసు,సాయిలు, సాయికుమార్ దండు సాయికుమార్ , అంబెం లక్ష్మణ్ ,గడ్డం సతీష్,అగ్గు చంద్రశేఖర్,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
