ఎత్తోండలో హనుమాన్ మందిరం ముందు మురికి కాలువ దుస్థితి

పట్టించుకోని పంచాయతీ ఈఓ

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ  గ్రామంలో హనుమాన్ మందిరం ముందు మురికి కాలువ దుస్థితి ఈ విధంగా ఉందని గ్రామస్తులు ఆరోపించారు. కల్వర్టు మొరంతో నిండిపోయి  మురికి కాలువ తీయకపోవడంతో దుర్వాసనతో పాటు చెత్తాచెదారం నిండిపోయి చుట్టుపక్కల వారికి  దుర్వాసన వస్తుందని గ్రామస్తులు వాపోయారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా  హనుమాన్ మందిరంకు వెళ్లే భక్తులు దుర్వాసన భరించలేక  భక్తులు వెనుదిరిగి పోయారు.  మురికి కాలువ తీయకుండా వదిలేశారని గ్రామపంచాయతీ ఈఓ పై గ్రామస్తులు మండిపడ్డారు. ఎండాకాలం ఉండటంతో గ్రామాలలోని నీటి సమస్యను ఉండకుండా చర్యలు చేపట్టాలని డీఎల్పిఓ ఆదేశించిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తున్నారని గ్రామస్తులు అగ్రం వ్యక్తం చేశారు. గౌతమ్ నగరంలోని  8వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉన్న పలుమార్లు ఈవో దృష్టికి విన్నవించిన ఆయన పట్టించుకోవడంపై గౌతమ్ నగర్ కాలనీవాసులు గ్రామపంచాయతీ అధికారులపై మండిపడుతున్నారు. ప్రభుత్వం  స్పెషల్ అధికారులు  నియమించినప్పటికీ స్పెషల్ అధికారులు  గ్రామాలను పరిశీలించకపోవడంతంతో   గ్రామపంచాయతీ ఈవోలు కార్యదర్శులు, ఇష్టరాజంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. డిఎల్పిఓ గ్రామపంచాయతీలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అత్యవసర సమావేశంలో ఆదేశాలు జారీ చేసిన వారు పట్టించకపోవడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డిఎల్పిఓ ఆర్ డబ్ల్యు ఏఈ. గ్రామం పై దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


.