సిరిసిల్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ , బిజెపి పార్టీ లు ఓరగబెట్టింది ఏమీ లేదు

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం పై కేటీఆర్ ది సవితి తల్లి ప్రేమే

తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు అప్పుడు చెప్పినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ , బిజెపి పార్టీలు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన మాటలు  అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు 

ప్రజలకు తాము ఎట్లా చెప్పితే అట్లా ఇన్ని రోజులు  విని ఓట్లు వేశారని ఇప్పుడు కూడా అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో   ప్రజలను  మభ్యపెట్టి ఓట్లు దండుకుందామనే  ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉందని ఆయన  పశువా  మనిషా  అని ఆయన తీవ్రంగా విమర్శించారు,

తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనా మీరు చేసినారు ,,,, మిషన్ భగీరథ పేరు మీద  వందల కోట్ల డబ్బులు దండుకున్నారు    అదంతా మీరు కాదా తాగునీరు ఇవ్వకున్న సాగునీరన్నా ఇవ్వమని అడుగుతున్నావు అడగడానికి  కొంత అర్థం ఉండాలి  

వాటర్ కొరత ఎక్కడ లేదు తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలం చేసినామని మీరు చెప్పుకున్నారు మరి అట్లాంటప్పుడు కరువు ఎట్ల వచ్చిందని ఆయన ప్రశ్నించారు,,

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది  మేము వచ్చిన తరువాత వర్షాలు పడడానికి ఇది వర్షాకాలమా నీకు తెలువదా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావ్ ,,,అని లక్ష్మారెడ్డి ప్రశ్నించారు,

పోలీసుల బందోబస్తు పెట్టి అన్నవరం,  మెడిగడ్డ సుద్దిళ్ల , మూడు ప్రాజెక్టుల నీళ్లన్నీ గంగాపాలు చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు, వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టి సర్వనాశనం చేసింది మీరు కాదా ఆయన ప్రశ్నించారు,,

ఇవన్నీ ప్రజలు అడగరని  అనుకుంటున్నారా గమనించరని అనుకుంటున్నారా అది మీ పొరపాటు అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఓడించారని ఆయన గుర్తు చేశారు,

100 రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కిందన్నారు,

పార్లమెంటు ఎన్నికల  కోడ్  ఉన్నందున 6 వ గ్యారంటీ , రైతులకు  రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎన్నికల తరువాత ఇవ్వడం జరుగుతుందన్నారు, మీ లెక్క రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పించుకోలేమన్నారు,  

తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని మాట చెప్పి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు,

తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి  చేయకుండా వదిలేసి కేటీఆర్ సవతి తల్లి ప్రేమ ప్రదర్శించి వాళ్ళ బావ వాళ్ళ అయ్యా 12 , 13 ప్యాకేజీ ద్వారా ఎర్రబెల్లిలో భూమి ఉందని నీళ్లు తీసుకుపోయిన మాట వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు,

ఏ మొహం పెట్టుకొని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ,  బిజెపి పార్టీలు ఈ ప్రాంత ఓటర్ల ను   ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు,

ఈ  విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,  ఎల్లారెడ్డిపేట మండల కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

.