డిసిసి ఉపాధ్యక్షునికి పరామర్శించిన గిరిజా షెట్కార్

తెలంగాణ ప్రభ( కోటగిరి ): కోటగిరి మండల కేంద్రంలోని నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్ కి సోషల్ మీడియా వార్ రిమ్ మెంబర్ గిరిజా షెట్కార్ ఆయన నివాసంలో కలసి  పరమర్శించారు. ఆయన ఇటీవల  హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి రావడం జరిగింది.ఆమె అతని  ఆరోగ్యం పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలం ఉండడంతో విశ్రాంతి తీసుకోవాలని పలు సూచనలు చేశారు .ఆమె వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  షాహిద్, మాజీ  ఎంపీపీ పవన్ కుమార్, ఎంపీటీసీ కేశ వీరేశం ,మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ పుప్పాల అభిషేక్,  ఆయూబ్, అఫ్జల్, ఎజాజ్ ఖాన్, కిసాన్ కేత్ మండల అధ్యక్షులు ఆనంద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్కంటి సాయిలు,    బజరంగ్ దత్తు, శ్రీపద్, పలు గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.