అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

తెలంగాణ ప్రభ .(కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని పలు  గ్రామాలలో జై శ్రీరామ్ అంటూ శ్రీరామాలయాలు భక్తిశ్రద్ధలతో బ్యాండ్ మేళాలతో మారు మోగిపోయాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ రామాలయంలో శ్రీరాముని  సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరణతో భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ చైర్మన్లు  భక్తుల సన్నిధిలో  కళ్యాణం ఘనంగా నిర్వహించారు .మిర్జాపూర్ రామాలయంలో  ముమ్మలనేని రాజశేఖర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలో  పాల్గొని పూజలు చేశారు . పలు గ్రామాలలో ఆలయ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మమ్మలనేని రాజశేఖర్ దంపతులు , పలు ఆలయాల అధ్యక్షులు మండల  ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లూరు కిషోర్ బాబు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, గోగినేని హనుమంతరావు, వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు జానకిరామ్, సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు, బర్ల మధు, రమేష్ ,శ్రీధర్ బాబు విట్టల్ వరుణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

.