వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్, నిజాంపేట్ హనుమాన్ టెంపుల్, కౌసల్య కాలనీ, బాచుపల్లి అంగన్వాడి స్కూల్, కేటీఆర్ కాలనీ, సుఖి 9 కమ్యూనిటీ, ఈశ్వర్ విల్లాస్, రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రాం రెడ్డి నగర్, గాంధీనగర్, లెనిన్ నగర్, చంద్రగిరి నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ శ్రీరాముడి జీవితం ఆచరణీయమని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆవిర్భవించిన అవతారమే శ్రీరామ అవతారం అని అన్నారు. శ్రీరాముడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, రవికాంత్, 22వ డివిజన్ అధ్యక్షులు శ్రీకర్ గుప్తా, మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాష్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, శ్రమశక్తి అవార్డు గ్రహీత ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు సతీష్, యాదగిరి గౌడ్, బోయిని మహేష్, రవి కిరణ్, ఇబ్రహీం, సిద్ధిక్, నదీమ్ రాయ్, సత్యనారాయణ యాదవ్, మూసాఖాన్, రమ్మీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.