తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనముతో పాటు మండల వ్యాప్తంగా నిర్వాహకులు శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని బుధవారం నిర్వహించారు,
సత్సంగ సదనం అద్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పురోహితులు రాచర్ల హాన్మండ్ల శర్మ ఘనంగా నిర్వహించారు,
అదేవిధంగా సద్ది మద్దుల రెడ్డి సంఘం , శ్రీ సాయిబాబా మందిరంలో, రాచర్ల గొల్లపల్లి , నారాయణ పూర్ , బండలింగం పల్లి గ్రామంల్లోని శ్రీ రామాలయం లో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగాయి,
ఖమ్మం కు చెందిన భాగవత్తార్ బ్రహ్మశ్రీ రాయప్రోలు సుబ్రమణ్య శర్మ చే సీతా కళ్యాణం హారికథ కాలక్షేపం కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు ,
శ్రీ రామ నవమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , నాయకులు పందిర్ల లింగం గౌడ్ , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు పందిర్ల లింగం గౌడ్ .మందాటీ దేవేందర్ యాదవ్, బండారి బాల్ రెడ్డి, మెగి నర్సయ్య, గంట వెంకటేష్ గౌడ్, గంట కార్తిక్ గౌడ్, ఎనుగంటీ శ్రీ నివాస్ యాదవ్, గంట బుచ్చాగౌడ్ , గుర్రపు రాములు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సెస్ డైరెక్టర్ కృష్ణ హారి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , నాయకులు ఎలగందుల నరసింహులు, బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, యమగొండ కృష్ణారెడ్డి , మిరియాల్ కర్ రవి , భక్తి సంఘం ప్రతినిధులు లక్ష్మమ్మ , మహాదేవ్ , రాంరెడ్డి, అనంతరెడ్డి, నారాయణ రెడ్డి, రేవూరి లక్ష్మి నారాయణ గుప్తా, గంప నాగేంద్రం గుప్తా, రాములు గుప్తా, బొమ్మ కంటి రవీందర్ గుప్తా, నాగుల ప్రదీప్ గౌడ్, ద్యానం లక్ష్మి నారాయణ, శ్రీ రాములోరి కళ్యాణాన్ని తిలకించారు స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు,
ఈ సందర్భంగా సత్సంగ సదనం లో పాల్గొన్న భక్త కోటికి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం వితరణ చేశారు, అదేవిధంగా గొల్లపల్లి లో, నారాయణ పూర్ లో వితరణ జరిగింది,
.