తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా గాజులరామారం డివిజన్ ఉషోదయ కాలనీ కమ్యూనిటీ హాల్ గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలను పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్ధిగా సునీతమ్మను ఎంపీ అభ్యర్థిగా నిలిపి బిజెపి గెలుపుకు తోడ్పాటునం దిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు . గత 10 ఏళ్లలో ఎన్నడూ కనబడని వాటర్ ట్యాంకర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జోరుగా తిరుగుతూ ప్రజలకు నీటి కష్టాలను గుర్తు చేస్తున్నాయన్నారు.కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐటీ రంగంలో పెట్టుబడులు తేవడం, ఫ్లై ఓవర్లు నిర్మించడంలో అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కెసిఆర్ దేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపి పార్టీకి ఓటు వేసినట్లే. మిత్రులారా ఆలోచించండి.. ఆగం కాకండి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయండి. మల్కాజిగిరి కి సంబంధంలేని కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు వారికి మల్కాజిగిరి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ ప్రచారంలో ప్రతి నాయకుడు, నాయకుడు ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ గెలుపు అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు. గత 20 ఏళ్లుగా పదవులు వచ్చినా, రాకున్నా ప్రజా క్షేత్రంలో ఉంటూ ఎన్నో వైద్య శిబిరాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి కల్పనతో ప్రజల్లో మమేకమైన నాయకుడు మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అని, ఇటువంటి నేతను ఎంపీగా గెలిపించుకుంటే అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.