అంబరాన్నంటిన సాంస్కృతిక వార్షికోత్సవ వేడుకలు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): హైదరాబాద్ నగరం నడిబొడ్డులో గల రవీంద్ర భారతి ఆడిటోరియంలో సోమవారం సైమా 2024 అవార్డుల మహోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. సైమా రిజిస్టర్ల సొసైటి నెంబర్ 36/2018 (క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూటషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లో ఉన్న సుమారు 100 స్కూళ్లలో దాదాపు 25 పాఠశాలలు ఈ సాంస్కతిక వేడుకలలో పాల్గొని ఆటపాటలతో మంత్ర ముగ్దులను చేస్తూ అద్భుతమైన ప్రదర్శనలు చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ సైమా కన్వీనర్ డి రాజేశ్వర్ రావు, సైమా లీగల్ అడ్వైజర్ రాజు అలెక్స్, క్రిస్టియన్ మైనారిటి ఫైనాన్స్ చైర్మన్ దీపక్ జాన్, సెయింట్ పీటర్స్ ఎడ్యుకేషన్ ఇంస్టిట్యూషన్ చైర్ పర్సన్ విద్యా స్రవంతి,డాక్టర్ జెట్టి ఎ ఆలివర్, నటులు క్రిష్ణ తేజ, జగదీశ్వరీలు హాజరై వేడుకలను తిలకించారు. విజేతలకు తమ చేతుల మీదుగా సైమా అవార్డులను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా సైమా ప్రెసెడెంట్ డాక్టర్ పి జోసఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ విద్యా సంస్థలన్ని కలిసి ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ అన్ని ఐక్యంగా ఏర్పడి పేద పిల్లలకు అనాథ పిల్లలకు బాలికలకు , ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు పిల్లలో ఒకరికి ఉచిత విద్యను అందిస్తూ మురికివాడలలో ఉన్న విద్యార్ధులకు వెనుకబడిన విద్యార్ధులకు విద్యానందిస్తూ చిన్నారులకు బంగారు భవిష్యత్తును ఇస్తున్నామన్నారు. అనేక రకాలుగా పిల్లలకు పేదలకు అనాథలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అందరి సహకారంతో సైమా ద్వారా దేశంలో నిరక్షరాస్యత నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామన్నారు. విద్యార్ధులకు ఆటలపోటీలు, ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులకు హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తామన్నారు. కుల,మత, వర్గ విబేధాలు లేకుండా అందరికి సమానంగా సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి క్రుషి చేస్తామన్నారు. ఈ సైమా కార్యక్రమానికి హాజరైన అతిరథ మహారథుల అందరికి ధన్యవాదాలని, వారి సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తామని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో సైమా జనరల్ సెక్రెటరీ డాక్టర్ జి శేఖర్, ట్రెజరర్ జి డేవిడ్, డాక్టర్ జీవన్ సూర్య, డాక్టర్ ప్రభు డిడి, వైస్ ప్రెసిడెంట్ పద్మా, పిఎ పౌల్ రాయ్, మేరి రేణుకా రెడ్డి, ఎస్ ప్రియదర్శిని, టి సునీత విద్యార్దులు, ఉపాధ్యాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.