తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు మర్మముల మల్లేష్, వంగాల పరశురాం, పండి గణేష్, పండి నరేష్, సుధాకర్, మురళి, మధు, ఈదుల నరేష్, దౌపాటి మల్లేష్, వేణు, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.
