రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని కలిసిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్

తెలంగాణ ప్రభ (కోటగిరి):  తెలంగాణ  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారిక నివాసంలో శనివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం  వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఆయన నివాసంలో కలిసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలిక్, డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్,  మాజీ ఎంపిపి  గంధం పవన్ కుమార్, బర్ల  మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

.