ఆలయం నిర్మాణం కోసం టి టి డి మంజూరు చేసిన కోటీ 80 లక్షలు ఏమాయ్యాయి

రెండవ విడత టిటిడి 90 లక్షల రూపాయల మంజూరు కోసం 30 లక్షల రూపాయల కంట్రీబ్యూషన్  మాజీ మంత్రి 

కెటీఆర్ ఇస్తారంటీరీ ఏమైంది 

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణీ సత్యబామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి మొదటి విడతగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన కోటి ఎనబై లక్షల రూపాయలు  ఏమయ్యా యని ఎల్లారెడ్డిపేట ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులను,  ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నంది కిషన్ ను ప్రస్తుత కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ను పరామర్శించిన ప్రశ్నిస్తున్నారు,

అదేవిధంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రెండవ విడత 90 లక్షల రూపాయలు మంజూరు కోసం  మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ 30 లక్షల  రూపాయలు   కంట్రీబ్యూషన్ కింద స్వంతంగా  ఇస్తాడని అంటిరి ఏమైందని ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు , 

మొదటి విడత కోటీ 80 లక్షలు , రెండో విడత కోటి 20 లక్షలు మొత్తం మూడు లక్షల రూపాయల తో శ్రీ రుక్మిణీ సత్యబామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణం చేపడుతామని చెప్పి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గల పురాతన శివాలయంలో బాలాలయం నిర్మించి ఉత్సహా విగ్రహాలను బాలాలయంలో ఏర్పాటు చేసి సుమారు 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిర్మాణం పనులు ప్రారంభించకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు , 

అట్లాంటప్పుడు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సహా  విగ్రహాలను బాలాలయంలో ఎందుకు పెట్టారని  గ్రామస్తులు  ప్రస్తుత ఆలయ కమిటీ ని

ప్రశ్నించడంతో  చేసేది ఏమీ లేక  ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై గ్రామంలో విరాళాలు సేకరించాలని తీర్మానించారు, తీర్మానం మేరకు చైర్మన్ గడ్డం జితేందర్ ఆద్వర్యంలో ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ,  నరసయ్య ,గడ్డం దాస్, తిరుపతి లు శనివారం విరాళాల సేకరణ ప్రారంభించారు , ఎల్లారెడ్డిపేట కు చెందిన స్వర్గీయ   సురేందర్ రెడ్డి  సతీమణి శ్రీమతి.        నేవూరి ప్రమీల ఆమె కూతురు నేవూరి సౌజన్య రెడ్డి ఆలయ  నిర్మాణం కోసం  50,000   రూపాయలు,  ఆన్న ప్రసాన కోసం వచ్చిన హైదారాబాద్ లో స్థిర పడ్డ ఎల్లారెడ్డి పేట కు చెందిన ముప్పవరం ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు.అదే విధంగా ప్రీతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమరేందర్ రెడ్డి ,సాయి బాబా ఆలయ అర్చకులు గుండయ్య శర్మ లు విరాళంగా అందజేశారు. మొదటి రోజు సేకరించిన విరాళం రూపాయలు సుమారు లక్ష రూపాయల వరకు చేరుకుంది.


.