మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
తెలంగాణ ప్రభ (కోటగిరి) : పోతంగల్ మండలంలోని యాద్గర్ పూర్ సోంపూర్ టాక్లి గ్రామాలలో మూడు రోజులు క్రితం కురిసిన అకాల వర్షం వడగళ్ల వానతో కురవడంతో రైతుల పంట నష్టపోవడం జరిగిందని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పంట పొలాలను పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలను సర్వే చేసి పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆయన వెంట జెడ్పిటి శంకర్ పటేల్, జిల్లా కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, ఉమ్మడి మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఎజాజ్ ఖాన్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్, మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ ,నాగరాజుగౌడ్, చాకురే గంగాధర్ దిగంబర్ పటేల్, మాజీ సర్పంచులు గోపు సాయిలు,గౌతమ్, మువ్వ శేఖర్,కోడిచర్ల మల్లేష్ దిగంబర్ పటేల్, ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
.