తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలం చేతనగర్ గ్రామానికి చెందిన శ్రీ గంధం మక్కయ్య బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధిగా ప్రకటించి నియామక పత్రాన్ని హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన పార్టీలో చేసిన సేవలను గుర్తించి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతకు బిజెపి పార్టీపై అవగాహన కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని యువతకు దిశ నిర్దేశం చేయడాన్ని గుర్తించి ఆయనకు రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందన్నారు. శ్రీ గంధం మక్కయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ కు కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నన్నారు. ఆయన వెంట దివాకర్, స్వామి యాదవ్ బాన్సువాడ నియోజకవర్గ ఓబిసి కన్వీనర్ నాగం సాయిలు , బీజేపీపార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
