అభిమానమే కొలమానం పదవులు ఆనందాన్ని ఇవ్వవు : ప్రముఖ చలనచిత్ర నటుడు సోనూ సూద్

నటుడు సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిసిన హైకోర్టు న్యాయవాది నరేష్  

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): అభిమానమే కొలమానమని, పదవులు ఆనందాన్ని ఇవ్వవని ప్రముఖ చలనచిత్ర నటుడు సోను సూద్ అన్నారు. శుక్రవారం

సారధి స్టూడియోలో సోనూసూద్ తో హైకోర్టు న్యాయవాది, వెన్నెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకర నరేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుంకర నరేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో  కరోనా బాధితులకు, సమాజానికి చేసిన సేవను గుర్తిస్తూ రాష్ట్రపతి కోటాలో సోనూసూద్ ను రాజ్యసభ సభ్యులుగా నియమించాలని కోరుతూ భారత  రాష్ట్రపతికి రాసిన లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో జాతీయస్థాయిలో చర్చ జరిగిన విషయం విధితమే. ఈ విషయమై అప్పట్లో రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తూ ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరడమే కాకుండా ఆ విషయాన్ని అధికారికంగా తనకు తెలియజేశారని వివరించారు. దీంతో స్పందించిన సోనూ సూద్ మాట్లాడుతూ మీలాంటి వారి అభిమానం ముందు పదవులు నాకు ఆనందాన్ని ఇవ్వవని చెప్పారని నరేష్ తెలిపారు.  సోనూ సూద్ మానవత్వానికి మారుపేరని సుంకర నరేష్ కొనియాడారు.

.