తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి అభ్యర్థి టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ వాదులకు అన్ని విధాల అండగా ఉంటుందని,ప్రజలు మార్పును కోరుకోవడం జరుగుతుందని,కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మోసపూరిత హామీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, నిజామాబాద్ పార్లమెంట్ ఎంపిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని గెలిపించాలని, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి గారని,ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎల్లప్పుడూ ముందుంటారనీ,నిజామాబాద్ పార్లమెంట్ ఎంపిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని,కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.