కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి.
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలంలోని గ్రోమోర్ కార్యాలయంలో నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడంతో గ్రోమోర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు పలు దినపత్రికలలో రావటంతో నేడు కోటగిరి బీర్కూర్ గ్రోమోర్ కార్యాలయం తనిఖీ చేసి రైతులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. పంట పొట్ట దశకు రాకపోవడంతో సుమారు 150 మంది రైతులు నష్టపోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి దృష్టికి మండల కాంగ్రెస్ నాయకులు తీసుకుపోవడంతో గ్రోమోర్ తరుపున నష్టపరిహారం చెల్లించే వరకు విత్తన కంపెనీ యజమానులకు వదిలే ప్రసక్తే లేదని అన్నారు. సీడ్ కంపెనీ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ .. రైతులతో మాట్లాడి గ్రోమోర్ కార్యాలయ అధికారితో, సీడ్ కంపెనీ యజమానితో మాట్లాడి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రయత్నిస్తానాని అన్నారు. రైతులు నిరాశపడుద్దని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట ఎంపీటీసీ కొట్టం మనోహర్ మండల కిసాన్ కేత్ అధ్యక్షులు ఆనంద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్,కప్ప గణేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
.