మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద  జ్యోతి రావ్ పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, శ్రమ శక్తి అవార్డు గ్రహీత ఎత్తరి మారయ్య, నిజాంపెట్ 22వ డివిజన్ అధ్యక్షులు శ్రీకర్ గుప్తా,    రమ్మీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

.