రంజాన్ వేడుకల్లో మండల బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం సారంపెళ్లి గ్రామంలో గురువారం రంజాన్ పర్వదినం సందర్భంగా మైనార్టీ నాయకులు షేక్ అబూబకర్,మహమ్మద్ శంషోర్ వారి స్వగృహాలలో వారి కుటుంబ  సభ్యులకు తంగళ్ళపల్లి మండల బిఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేసి రంజాన్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు పడిగల రాజు, మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్, ఎంపీటీసీ గుగ్గిల లావణ్య ఆంజనేయులు, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు గుండి మహేష్, రాజేశ్వరరావు, బరిగల జగదీష్ తదితరులు పాల్గొన్నారు

.