తెలంగాణ ప్రభ (కోరుట్ల): టీ బీసీ జేఏసీ,తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గురువారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు సందర్భంగా టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు,సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీ బీసీ జేఏసి,సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆయా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు.
అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ళ నుంచి బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని,బీసీ లకు అట్రాసిటీ చట్టం వర్తింప జేయాలని ,బీసీ లకు కేంద్రం లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో కుల గణన కోసం 150 కోట్లు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయడం ,కుల గణన అనంతరం బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామనమని బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పూలే స్పూర్తితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీ బీసీ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి విజయ్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాథం,కోశాధికారి వి.ప్రకాష్ రావు,,పెన్షనర్స్ జిల్లా సహాయ అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్, జర్నలిస్టు దూడం శ్రీశైలం,మహిళా జేఏసీ జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ,వివిధ సంఘాల ప్రతినిధులు పి.ఆశోక్ రావు,సత్యనారాయణ,యాకూబ్ హుస్సేన్,కిషన్ రావు,సూర్యనారాయణ,విట్ఠల్, గంగాధర్,బక్కశెట్టి లక్ష్మి,విజయ,పద్మ,తదితరులు పాల్గొన్నారు.
.