తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి నగర్ డివిజన్, గాంధీ నగర్ లోని ఈద్గా మహమ్మదీయ లో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలు అందుకోవాలని ఆకాంక్షించారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగను ముస్లింలు అందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాజా మియా, బాబు మియా, జలీల్, మహ్మద్ అన్సార్, పాషా, వాజీద్, షాకీర్, ఫుర్కాన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
