ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జ్యోతి రావు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ 

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): మహాత్మ జ్యోతిరావు పూలే  జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండలంలో  గురు వారం బిఎస్పీ , మహాజన్ సోషలిస్టు పార్టీ, బిసి సంఘాల  నాయకులు ఘనంగా నిర్వహించారు

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం జ్యోతి రావు పూలే సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను  ఆవిష్కరించి  పూలమాలలు వేసి నివాళులర్పించారు,  ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సంఘం అధ్యక్షులు జెల్లశ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమండ్లు పాల్గొని మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని ఆయన బాటలోనే ముదిరాజ్ సోదరులంతా నడవాలని పిలుపునిచ్చారు . విగ్రహాల దాత  డిప్యూటీ తహాశీల్దార్ ఎలుసాని ప్రవీణ్ యాదవ్ ను గ్రామస్తులు తదితరులు అభినందించారు, 

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దొమ్మాటి నర్సయ్య ,నిమ్మ లక్ష్మి,ఎంపీటీసీ అపేరా  సుల్తానా ,మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్ ,సిరిపురం మహేందర్ ,డిప్యూటీ తాసిల్దార్ బురక గోపాల్ ,ముదిరాజ్ మండల సంఘం అధ్యక్షులు అంజయ్య ,గ్రామ సంఘం అధ్యక్షులు ఎలవేణి శ్రీనివాస్ ,పాముల దేవయ్య ,మామిండ్ల బాల నర్సు  ,జెల్లా సత్తయ్య,  జెల్లా రవి  ,నాంపల్లి ,గ్రామస్తులు పాల్గొన్నారు

పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే 19 వ శతాబ్దంలో గొప్ప సంఘసంస్కర్తలొ ఆగ్రా గాన్యుడన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల విద్యకు కృషి చేసిన గొప్పవ్యక్తిని కొనియాడారు. మూడ నమ్మకాలకు  వ్యతిరేకంగా బలమైన ఉద్యమం చేసి, జనాభా ప్రతిపాదన ఉద్యోగాలు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి చూయించిన మహనీయుడు పూలేన్నారు. ఈ కార్యక్రమంలో

బహుజన్ సమాజ్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పి ఎస్ పి మండల అధ్యక్షులు అందే శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు తాటిపల్లి అంజయ్య,  మండల ఇన్చార్జి లింగాల సందీప్  లు మహాత్మా జ్యోతిరావు పూలే చేపట్టిన సంస్కరణల గురించి వారు కొని యాడారు  

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సంజీవ్, మండల ఉపాధ్యక్షులు నాలకంటి లక్ష్మీరాజం, మండల కార్యదర్శిలు అందే ఈశ్వర్, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డమీది సాయి చంద్, బండి ఉదయ్ లు తదితరులు పాల్గొన్నారు.

మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ  ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు,

మహత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ,  బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి , పూలమాలను వేసి నివాళులర్పించారు,.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చేసిన సంస్కరణలు గొప్పవని వారు కొనియాడారు ,

ఈ కార్యక్రమంలో నాయకులు చెట్కూరి కృష్ణమూర్తి గౌడ్   శ్రీమాన్ ,  కట్టెల బాబు, రాములు రమేష్ రాము తదితరులు పాల్గొన్నారు

.