ఘనంగా మాహత్మ జ్యోతిబాపూలే జయంతి

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే  జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ నాయకులు హాజరై మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమం సందర్భంగా మీర్జాపూర్ సాయన్న మాట్లాడుతూ... భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త అని కొనియాడారు. ఆయన మహిళా విద్య అభివృద్ధికి  మార్గదర్శి అని పేర్కొన్నారు. సాంఘిక దురాచారాలపై తీవ్రంగా పోరాడిన మహా గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొట్టం మనోహర్ ,మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, బర్ల మధు, అనిల్ కులకర్ణి, కప్ప గణేష్, బ్యాగరి రాములు పుప్పల సైదయ్య,పాల గంగారాం, ఎమ్మార్పీఎస్ నాయకులు దావులయ్య పి. లాలయ్య, హస్గుల రవి, బ్యాగరి మారుతి పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.