శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీ విరాళం అందజేసిన గాగిలం శ్రీనివాస్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన యకీన్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మల్లికార్జున ఆలయ నిర్మాణానికి శ్రీ మల్లికార్జున ఆలయ నిర్మాణానికి గాగిలం శ్రీనివాస్ ఒక లక్ష భారీ విరాళాన్ని అందజేసి తన భక్తిని చాటుకున్నారు. గ్రామంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా తన వంతుగా సహాయం అందజేసే గాగిలం శ్రీనివాస్ దంపతులను శ్రీ మల్లికార్జున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మాధవి దంపతులను ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మేడిపల్లి పెద్ద ముత్యంరెడ్డి, కాశిరెడ్డి మోహన్ రెడ్డి,కచ్చు రమేష్ చొప్పరి శంకర్, మామిడి మల్లేశం, గంగ మల్లయ్య, ఎనుగుల మల్లయ్య తదితరులున్నారు

.