తెలంగాణ ప్రభ (వర్ని): పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని గురువారం వర్నిమండలంలోని వడ్డేపల్లి శ్రీనివాస్ కాలనీ జాకోరా జలాల్పూర్ బడా పహాడ్ దర్గాల వద్ద మసీదుల్లో గ్రామాలలో గల ఈద్గాల వద్ద ముస్లిమ్ సోదరులు మత పెద్దల సమక్షం లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత నెలరోజులుగా కొనసాగిన కటోర ఉపవాస దీక్షలు నిన్నటి తో పూర్తవగా, పండగ సందర్భంగా ముస్లిం సోదరులు నూతన దుస్తులను ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
