తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బి.వై.నగర్ బంగారు మైసమ్మ ఆలయంలో బిఆర్ఎస్ నాయకులు దార్ల సందీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సకల జనులను సౌఖ్యంగా చూడాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తోట ఆగయ్య తెలిపారు. బంగారు మైసమ్మ ఆలయం వద్ద ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తో పాటు కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు దార్ల సందీప్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ,కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ భోద్దుల భాస్కర్, పలురు ప్రముఖులు పాల్గొన్నారు.
