కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి కోమటీరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నేవూరి
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని , రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,
ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆయన సతీమణి మమతా వెంకట్ రెడ్డి లు బిఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు,
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శివకుమార్ ను రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను , శ్రీధర్ బాబు ను, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను , సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ని , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులను మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డీ, అతని సతీమణి మమతా వెంకట్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి , సిరిసిల్ల ముస్తాబాద్ , గంభీరావుపేట, మండలాలకు చెందిన తన సన్నిహిత సహాచరులైన వివిధ పార్టీల నాయకులను మాజీ సర్పంచులతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నాడు
ఈ మెరకే రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నేవూరి వెంకటరెడ్డి స్వయంగా కలిసి మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది ,
నేవూరి వెంకట్ రెడ్డి ఏది చేసిన అదే సంచలనమే అవుతుందని సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చా జరుగుతుంది
.