తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని చావడిగల్లికి చెందిన పేద మైనార్టీ ఫకీర్ కుటుంబాలకు 30 మందికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ మండల కోఆప్షన్ మెంబర్ హకీమ్ రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి 850 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులతో పాటు రంజాన్ తోపాలను అందజేశారు. ఎంపీటీసీ కొట్టం మనోహర్ షాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ... పేద కుటుంబాలకు రంజాన్ పండగ తోపాలను అందజేసి నిరుపేద కుటుంబ ఆదుకున్నందుకు అతని సహాయ సహకారాలు ఎప్పుడూ మరువలేమని అన్నారు. కోటగిరి మండల చావుడిగల్లి తరఫున ఆయనకు వారి కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. దసరా పండగ మాసంలో హిందూ బంధువులందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హకీమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, ఎంపిటిసి కొట్టం మనోహర్, బర్ల మధు,ఎజాజ్ ఖాన్, యూత్ అధ్యక్షులు అబ్దుల్ వాజీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
