తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని యాద్గర్ పూర్ గ్రామంలో ఉగాది పండుగను గ్రామంలోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త పంచాంగాన్ని పంతుల చేత పంచాంగ శ్రావణం చేపట్టారు. గ్రామస్తులందరూ కలిసి చూసుకోవడం జరిగింది. అనంతరం ఉగాది పండగను పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలో మహారాష్ట్ర ,తెలంగాణ, కర్ణాటక నుండి మల్లయోధులు కుస్తీ పోటీలో పాల్గొని గ్రామస్తులకు ఆనందింపజేశారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కుస్తీ పోటీలను చూసి ఉత్సాహంలో మునిగిపోయారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగను సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తామని గ్రామ పెద్దలు , తెలిపారు. ఈ కుస్తీ పోటీల్లో ఆయా గ్రామాల మల్లయోధులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఫుల్కంటి కిష్టయ్య, సాయ గౌడ్ ముత్తయ్య, మీర్జాపూర్ చిన్న సాయన్న, హుస్సేన్ ,సాయిలు మైతాబ్, దాదు మున్వర్ సంజీవయ్య, రాజయ్య, గౌస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
