తెలంగాణ ప్రభ (పోతంగల్): పోతంగల్ మండలంలోని సోంపూర్, టాక్లి, రాంగంగానగర్, దోమలేడిగి గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో నష్టపోయిన పంట పొలాలను మంగళవారం మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పరిశీలించారు.ఆయన రైతులతో మాట్లాడుతూ .. వ్యవసాయ అధికారులతో నష్టపోయిన పొలాలను సర్వే చేయించి సహాయం అందజేస్తామని రైతులకు భరోసా కల్పించారు. సుమారు 500 ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలకు ఒక ఎకరం చొప్పున 10 వేల రూపాయల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందించేలా కృషీ చేస్తానని రైతులు తెలిపారు. ఆయన వెంట పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్, కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి ,మాజీ ఎంపీపీ గంధపు పవన్, డిసిసి డెలిగేట్ సుంకిని హనుమంతు, వల్లేపల్లి శ్రీనివాసరావు, కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్ పీర్యా నాయక్, మాజీ ఎంపీటీసీ తరుణ్, గంధపు రాజు, ధనరాజ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
