చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటాం

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) హెచ్ఎంటి అడవి ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరుకుతున్నారని ట్విట్టర్ ఫిర్యాదు సమాచారంతో ఐఎఫ్ఎస్ పిసిసిఎఫ్ డబ్ల్యూఎల్ సిడబ్ల్యూఎల్ డబ్ల్యూ (ఎఫ్ సిఏ) (ఎఫ్ఎసి) ఫారెస్ట్ అధికారి మోహన్ చంద్ర మంగళవారం అటవీ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమంగా చెట్లు నరికితే, చట్టపైనమైన చర్యలు తీసుకొని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని స్థానికులకు సూచించారు. రాబోయే రోజులు తగిన జాగ్రత్తలు తీసుకొని చెట్ల నరికివేతను అడ్డుకుంటామని తెలిపారు.

.