ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంతన్న సైన్యం కీలక పాత్ర పోషిస్తుంది

రేవంతన్న సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): రేవంత్ అన్న సైన్యం టీం సభ్యులు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ కష్టం మీ శ్రమ ఎప్పటికీ మరువలేనిదని ఏడు సంవత్సరాలుగా రేవంత్ అన్న సైన్యం తరఫున మీరు చేస్తున్న సేవా కష్టం పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, రేవంత్ అన్న సైన్యం సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారని రేవంత్ అన్న సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ అన్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలను పట్టిపీడించిన కేసీఆర్ ను ఓడగొట్టామని, ఇక మన విజన్ సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం మన ముందు ఉందని ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయడమే మన అంతిమ లక్ష్యమని రేవంత్ రెడ్డి సైన్యం అధ్యక్షులు నరసింహకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని ఆయన తెలిపారు. ఆయన ఆదేశాలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ అన్న సైన్యం సభ్యులు ప్రతి ఒక్కరు ఓ సైనికుల కష్టపడి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన అంతిమ లక్ష్యం మన నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ నీ ప్రధానమంత్రి చేసే వరకు ఏ ఒక్కరు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్ అన్న సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ అన్నారు. ఈ దేశ ప్రజలను కులాలుగా మతాలుగా విభజించి తన రాజకీయంగా  వాడుకుంటూ, ఒక వైపు యువతను మతం ముసుగులో ముగ్గేలాగా చేసి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా ఆయన ముందుకు సాగుతున్నారని అలాంటి నరేంద్ర మోడీని, బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

.