ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో జంగారెడ్డి పల్లె విజయం

రన్నర్ గా నిలిచిన ఇల్లంతకుంట జట్టు

బహుమతులను అందజేసిన జంగారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ శ్రీలత నరేందర్ రెడ్డి 

తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది, రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ ఆసక్తిగా సాగింది. చివరకు జంగారెడ్డి పల్లె క్రికెట్ జట్టు ఇల్లంతకుంట జట్టుపై 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ విజేతగా మారింది . గత 25 రోజులుగా జంగారెడ్డి పల్లె గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను శ్రీరామలింగేశ్వర యూత్  నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన జంగారెడ్డి పల్లె జట్టుకు మాజీ సర్పంచ్ తుంకుంట్ల శ్రీలత నరేందర్ రెడ్డి 16 వేల రూపాయల తోపాటుగా కప్పును అందజేశారు. అదేవిధంగా ఇల్లంతకుంట జట్టుకు నాగరాజు పంతులు (జంగారెడ్డి పల్లె )ఎనిమిది వేల రూపాయల తో పాటుగా కప్  ను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, రామలింగేశ్వర క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

.