పంచాంగ శ్రవణ కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీపీ

తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): తెలుగు వారందరికీ ఉగాది అంటేనే పచ్చడి, పంచాంగ శ్రవణం అని ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం అనాదినుంచి  ఆనవాయితీ వస్తున్నదని ఈ రోజు తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకోవాలనుకుంటారని గౌరవ ఎంపీపీ శ్రీ వుట్కూరి రమణా రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు ముస్కానిపేట,గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, సోమరంపేట గ్రామంలో పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారాని ఈసారి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది ఈసారి తెలుగు ఏడాది శ్రీ ‘క్రోధి’నామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది ప్రముఖ పండితులు శ్రీ శ్రీనివాస పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిచారని. ప్రజలు వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఏమైనా దోషాలుంటే నివారణలు ఎలా చేసుకోవాలి ఉగాది పంచాంగం విశిష్టతలేంటి పంచాంగం శ్రవణం ద్వారా అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మాజి ఎంపీపీ గుడిసె ఐలయ్య  నాయకులు,గ్రామ ప్రజలు  తదితరులు  పాల్గొన్నారు...

.