ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి  జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఇందిరాభవన్ లో ఎన్ ఎస్ యు ఐ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు చెట్టే భార్గవ్ చేతులమీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 

ఈ సందర్బంగా ఎం పి అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పాటుపడాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి-దేవేందర్ రెడ్డి,  మున్సిపల్ ఛైర్మెన్ అడువాల జ్యోతి-లక్ష్మణ్, టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ రఘువీర్ గౌడ్, గొల్లపెల్లి మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ గంగం మహేష్,యూత్ నాయకులు రాగుల ప్రదీప్,డబ్బు నిఖిల్, జుంబర్తి కిషోర్, మహిపాల్, ముల్లె శీను మరియు తదితరులు పాల్గొన్నారు

.