వడ్డేపల్లి లో శ్రీ నల్ల పోచమ్మ జాతర ఉగాది రోజున జాతరకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని వడ్డేపల్లి లో శ్రీ నల్ల పోచమ్మ జాతర ఉగాది రోజున జాతరకు ఏర్పాటు పూర్తి రెండు రోజులు పాటు జరగబోయే అమ్మవారికి పూజలు 9న ఉగాది పర్వదిన శ్రీ కోతి నామ సంవత్సరానికి పురస్కరించుకొని వడ్డేపల్లి లో అమ్మవారి జాతర నిర్వహించడం ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు మాట్లాడుతూ 9న ఉగాది పర్వదిన శ్రీ కోదినామ సంవత్సరాని పురస్కరించుకొని వడ్డేపల్లిలో అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ జాతర గత 50 సంవత్సరాల నుండి కొనసాగుతుందని వారు తెలిపారు ఈ రెండు రోజులు జరగబోయే జాతర కు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు అనంతరం మహిళలు బోనాలు గండ జ్యోతులతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అన్నారు రాత్రి ఒగ్గు కథ తో మొదటి రోజు ముగిస్తుంది ఇక రెండవ రోజు అమ్మవారికి ఉదయాన్నే మేకపోతులను కోడిపుంజులను అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పాల్గొంటారు

.