తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పాత్రికేయుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ. ...జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బీబీ పాటిల్ చేసిన అభివృద్ధి పనులు శూన్యమని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉన్న టిఆర్ఎస్ కు ఆనాడు ప్రజలు అవకాశం కల్పించిన సందర్భంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకై ప్రజలు బిబి పాటిల్ కు రెండుసార్లు అవకాశం ఇస్తే ఆయన తన వ్యాపారాలు పెంచుకోవడం కోసం గడిచిన 10 సంవత్సరాలు పని చేశాడని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధికి కృషి చేసింది శూన్యమే అన్నారు. ప్రస్తుతం రానున్న పార్లమెంటు ఎన్నికలలో దేశంలో ఇండియా కూటమికి ప్రజలు పట్టం కడతారని జహీరాబాద్ నియోజకవర్గ ఇండియాకుటమీ అభ్యర్థి సురేష్ షేట్కార్ కు జహీరాబాద్ ఓటర్లు ఓట్లు వేసి గెలిపించాలని సిపిఐ పార్టీగా కోరుతున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్, సిపిఐ మండల నాయకులు నల్లగంగాధర్, నాయకులు ఎం. తుకారం, శంకర్, లతీఫ్, శీను, హంగిర్గ మనోజ్, విష్ణు,రాజామణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
