అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని రచ్చ గల్లిలో సోమవారం బాగిర్తి సావిత్రి భర్త మృతి చెందడంతో ఆమె కుటుంబానికి తెల్ల రవికుమార్  యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు.మృతుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియల కోసం నగదును ఆర్థిక సహాయం రూపంలో అందజేశారు.  ముదిరాజ్ కుల పెద్దలు బీమా సాయి రెడ్డి కప్ప సంతోష్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో యువసేన నిర్వా హకులు  తెల్ల రవికుమార్, సభ్యులు పెద్ద కాపు శ్రీకాంత్ ,పప్పుల యోగేష్ ,హరి ప్రీత్ ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

.