కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగరావు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): సమాజంలో ఆధ్యాత్మిక భావన అలవడితేనే భావి సమాజం క్రమశిక్షణతో ముందుకు పోతుందని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు
ఆదివారం నియోజకవర్గ కేంద్రం అయిన కోరుట్ల పట్టణంలో శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముందస్తు ఉగాది ఉత్సవాల్లో జువ్వాడి నరసింగరావు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సేవాసమితి సభ్యులు చేస్తున్న కార్యక్రమాలను జువ్వాడి నర్సింగరావు కొనియాడారు అంతకుముందు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ సత్య సాయిబాబా సేవా సమితి సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలుచేయాలనీ ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ మాట్లాడుతూ సత్యసాయిబాబా సేవా సమితి తరపున నిర్మించబోయే సాయి ఆలయానికి తన వంతుగా వ్యక్తిగత తోడ్పాటు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు
సత్యసాయిబాబా సేవాసమితి అధ్యక్షులు చిదురాల అశోక్, చిదురాల నారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ రావు, కర్ణాకర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం సంగలింగం, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్త, చిట్యాల లక్ష్మీనారాయణ, లక్కాకుల సద్గురు, శంభోజి మధు, తెడ్డు విజయ్, చిట్యాల సందీప్, గొనె సదానంద్, రామ్మోహన్, నీలి శ్రీనివాస్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు
.