పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జువ్వాడి బ్రదర్స్
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు రేంజర్ల నర్సయ్య, మాజీ కౌన్సిలర్ ప్రస్తుత కోఆప్షన్ సభ్యురాలు రెంజర్ల కళ్యాణి లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈకార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కౌన్సిలర్లు ఎంబెరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడేపు మధు, మసాపూర్ వెంకటేశ్వర్రావు, తుపాకుల భాజన్న, మ్యాకల నర్సయ్య, దండవేని వెంకట్, చెట్లపల్లి రంజిత్, కస్తూరి రమేష్, తోడేటి శంకర్, చిలువేరి విజయ్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
