తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వనతడుపుల రవికుమార్ గవర్నమెంట్ టీచర్, మాస్ట్రో కళాశాల యాజమాన్య అధినేత ఆకుల రాజేష్, మరియు ప్రబంధకారిణి అధ్యక్షులు డాక్టర్ రవికిరణ్, మరియు కమిటీ సభ్యులు, సమితి సభ్యులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టి వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ముందుగా తొమ్మిదవ తరగతి విద్యార్థులచే స్వాగత నాట్య ప్రదర్శనతో ప్రారంభమై పాఠశాల ప్రధానాచార్యులు గోపు వెంకటేష్ పాఠశాల అనుభవాన్ని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల వరకు ఎలాంటి నియమ నిబంధనలు చేపట్టి వారిని పరీక్షలలో విజయం సాధించే విధంగా వారికి మెలకువలు నేర్పి మంచి ఉత్తీర్ణత సాధించే సాధించేలా కృషి చేయడం జరిగిందని ఆయన తెలియజేసినారు. మరియు భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి మెలకువలను కూడా పదవ తరగతి విద్యార్థులకు చెప్పడం జరిగింది.
ప్రబంధకారిణి జాయింట్ సెక్రటరీ ఎలిమెల్ల మనోజ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పై చదువులు అంటే ఎంబిబిఎస్ ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైన కోర్సులు ద్వారా కూడా మంచి ఉద్యోగాలు సాధించవచ్చని మరియు వచ్చే ఆరు సంవత్సరాలు విద్యార్థులకు ఎంతో ముఖ్యమైనమని ఈ దశలోనే విద్యా ప్రమాణాలు మెరుగుపరచుకొని ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి మార్గంలో వెళ్లాలని ఆయన సూచించడం జరిగింది.
ప్రబంధకారిణి అధ్యక్షులు డాక్టర్ వేముల రవి కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో క్రమశిక్షణతో ఉన్నత విద్యాభ్యాసం చేయవలసిందిగా సూచించడం జరిగింది.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన వనతడుపుల రవికుమార్ మరియు ఆకుల రాజేష్ విద్యార్థులను ఉద్దేశించి ఇంటర్ స్థాయి ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఉండే మార్పులు యువత చెడు దారి పట్టకుండా విద్యార్థులు ఒక ఆరు నుంచి పది సంవత్సరాల కాలంలో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసిస్తే జీవితంలో 75 సంవత్సరాల సంతోష జీవితాన్ని గడపవచ్చు అని తెలియజేయడం జరిగింది. దీని వెనుక ముఖ్యపాత్ర తల్లిదండ్రులదే కాబట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు మీ పిల్లలను వారి అలవాట్లను క్రమశిక్షణలో భాగంగా చూస్తూ వారికి మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరడం జరిగింది.
విద్యార్థిని విద్యార్థులు ఎక్కడ చదివినా ఎలా చదివిన వారి అంతిమ లక్ష్యం వారి అంబిషన్ ఏంటో ముందే నిర్ణయించుకొని ఏ కోర్సుకి వెళ్ళినా ఆ కోర్స్ 10 సంవత్సరాల తర్వాత కోర్సు వల్ల లభించే ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఈ స్థాయిలోనే నిర్ణయించుకొని ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది.
సరస్వతి శిశు మందిర్ అనతి కాలంలోనే కోరుట్ల పట్టణంలో ముందు స్థాయిలో నిలవడం దీని వెనుక పాఠశాల మాతాజీలు అధ్యాపకుల కృషి ఉండడం దీనికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రబంధకారిని మరియు సమితి సభ్యులను పేరుపేరునా అభినందించడం జరిగింది.
పాఠశాల కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు కొన్ని ముఖ్య సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు సొంత నిర్ణయం తీసుకునే వయసు వచ్చింది కాబట్టి వారు వారి ఆలోచనలు చెడు మార్గంలో వెళ్లకుండా ఎప్పటికప్పుడు వారిని పరిశీలిస్తూ వారికి మంచి సూచనలు చేస్తూ ఉండటం వల్ల వారు సక్రమమైన మార్గంలో ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రయత్నిస్తే డిగ్రీ స్థాయిలో వారు ఒక మంచి స్థాయిలో ఉండి వారు జీవితంలో ఎలా స్థిరపడాలో వారికి వారి నిర్ణయం తీసుకునే విధంగా ప్రయత్నించాలని కోరడం జరిగింది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పాఠశాల అధ్యాపక బృందానికి చిరు సన్మానం చేసి బహుమతులను అందించడం జరిగింది. అలాగే తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు బహుమతి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అందరినీ మెప్పించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి ప్రబంధకారిణి ప్రధాన కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, సభ్యులు అందే శివప్రసాద్, కొత్త సందీప్, కొండ బత్తిని అమర్నాథ్ మరియు సమితి సభ్యులు వడ్లకొండ రాజా గంగాధర్, చెట్టుపల్లి శంకర్, ముదిగొండ రాజేశం మరియు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది
.