అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో
శనివారం ఎంఈఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా నగర కార్యదర్శి మాడవేని సునీల్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రభ (కోరుట్ల): ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం వేసవికాలం దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించాలని జీవో జారీ చేసినప్పటి కొన్ని ప్రైవేటు పాఠశాలలు వారి లాభర్జనే ధ్యేయంగా రెండు పూటలా పాఠశాల నిర్వహించడం వలన విద్యార్థులు వేసవి వేడికి అల్లాడుతూ పలు రకాల రుగ్మతలకు గురై అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని దాని వల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోని పాఠశాలను పరిశీలించి వాటిపై తగు చర్యలు తీసుకొని, వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనియెడల విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలోనే కార్యకర్తలు రంజిత్, రాఘవేంద్ర , మణికుమార్, మణిదీప్ , పవన్, లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు.
.