కాంగ్రెస్ జన జాతరకు భారీగా తరలి వెళ్లిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ శ్రేణులు

దేశమంతా కాంగ్రెస్ వైపు చూస్తుంది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) తుక్కుగూడ లో కాంగ్రెస్ జన జాతర సభకు గండి మైసమ్మ చౌరస్తా నుండి భారీ కాంగ్రెస్ శ్రేణులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుక్కుగూడ జన జాతర సభతో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా తెలంగాణ రాష్ట్ర నుండే మేనిఫెస్టో విడుదల చేసి దేశానికి కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం అని దేశానికి మొత్తం తెలిసేలా చేయాలని ఆయన అన్నారు, దేశమంతా కాంగ్రెస్ వైపు చూస్తుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కోలన్ హనుమంతరెడ్డి , సీనియర్ నాయకులు  కోలన్ గోపాల్ రెడ్డి ,కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ,తలారి సాయి ముదిరాజ్ ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్  డివిజన్ నాయకులు,సీనియర్ నాయకులు,యువ నాయకులు తదితరులు తరలి వెళ్లారు.

.