రెండు కాళ్ళు విరిగిపోయి తీవ్ర గాయాలు
అశ్విని హాస్పిటల్ కి తరలింపు
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఎల్లమ్మ గుడి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు శుక్రవారం ఉదయం 7-00 గంటల ప్రాంతంలో డీ కొన్నాయి, ఈ సంఘటనలో అక్క పెళ్లి గ్రామానికి చెందిన పోతుల గాంధీ బాబు తీవ్రంగా గాయపడ్డాడు రెండు కాళ్ళు ప్యాక్షర్ అయ్యాయి,
షుగర్ బీపీ కంట్రోల్లో లేక గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పోతుల గాంధీ బాబు శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆశ్వీణీ హాస్పిటల్ కు వెళుతుండగా ఎదురుగా మరో ద్విచక్ర వాహనం పై అక్కపెల్లి గ్రామానికి చెందిన మందాటి సురేష్ అక్కపెల్లి వెళుతూ ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ప్రదాన రహదారి లోని దుమాల ఎల్లమ్మ గుడి సమీపంలోని వాగు బ్రిడ్జిపై పడిపోయాడు ,ఈ సంఘటనలో గాంధీ బాబు రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు,
ఈ సంఘటనలో స్వల్పంగా గాయపడిన సురేష్ తీవ్రంగా గాయపడిన గాంధీ బాబు ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆశ్వీణీ హాస్పిటల్ కు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి రెండు కాళ్ళు విరిగినట్టు నిర్దారించారు,
అనంతరం రెండు కాళ్లకు పట్టిలు వేసి ప్రథమ చికిత్స చేసినట్లు రెండు కాళ్ళకు ఆపరేషన్ చేసి రాడ్సా వేయాలని డాక్టర్లు చెప్పినట్లు అతని మిత్రుడు రాజన్న పేట గ్రామానికి చెందిన రెడ్డిమల్ల సత్యానారాయణ తెలిపారు,
ఈ విషయం తెలుసుకున్న గాంధీ బాబు కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకొని గాయపడిన గాంధీ బాబు ను చూసి బోరున విలపించారు అనంతరం పరామర్శించారు,
.