బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య కొనియాడారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు బాబూ జగజ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. ఆయన దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు.
అణగారిన వర్గాలను అభ్యున్నతికి పోరాడిన యోధుడు, మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అన్నారు ,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పందిర్ల లింగాగౌడ్ , కొమిరిశెట్టి తిరుపతి , యూత్ మండల అధ్యక్షులు బానోతు రాజు నాయక్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాడి రామ్ రెడ్డి, రపిక్ , ఏ రవి , బండారి బాల్ రెడ్డి , నంది కిషన్, అంతేర్పుల గోపాల్ , కనకరాజు, శ్రీనివాసు, గంట అంజా గౌడ్, మద్దుల శ్రీపాల్ రెడ్డి, ముద్ర కోలా శ్రీనివాస్, రాంచందర్ నాయక్, వడ్నాల ఆంజనేయులు , మేడిపల్లి రవి , గంట వెంకటేష్ గౌడ్, భీపేట రాజకుమార్ , తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు,
ఎల్లారెడ్డిపేట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ వద్ద బాబూ జగజ్జీవన్‌రాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ ను మహాజన్ సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ కట్ చేశారు , అనంతరం ఎంఎస్ పి జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ మాట్లాడుతూ దళితులు ఇతర వర్గాల కోసం పార్లమెంట్ లో కృషి చేసి, చరిత్రలో నిలిచి పోయిన నాయకుడు బాబూ జగజ్జీవన్‌రాం అన్నారు ఈ నాడు జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు,
ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలు ఈ జయంతి వేడుకల్లో పాల్గోన్నారని అన్నారు ,
ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారన్నారు,
ఈ సంధర్భంగా ఆయన చేసిన సేవలను కోనియాడారు. కులరహిత సమాజం కోసం బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని లక్ష్మన్ కొనియాడారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని అదేవిధంగా ఆర్దికంగా దళితులను అభివృద్ది లోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేయాలన్నారు ,
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అదికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, దళిత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎరుపుల దేవయ్య , బాయికాడి రామచంద్రం, ఎలగందుల దేవయ్య, అంతేర్పుల కనకరాజు , ఎరుపుల శ్రీనివాస్ అంతేర్పుల గోపాల్, ఎలగందుల రాజా తేజ , అంతేర్పుల తిరుపతి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు,
.