సర్పరాజ్ పల్లికి చెందిన పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జువ్వాడి బ్రదర్స్

గ్రామ అభివృద్ధికి తప్పక కృషి చేస్తాం..

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్ పల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి తోట గంగాధర్ ఆధ్వర్యంలో సర్పరాజ్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ల సమక్షంలో కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం జువ్వాడి బ్రదర్స్ మాట్లాడుతూ స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో ఏ విధంగా అయితే సర్పరాజ్ పల్లి అభివృద్ధికి కృషి చేశారో అదేవిధంగా సర్పరాజ్ పల్లి అభివృద్ధికి కృషి చేస్తామని, కావున పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. 

ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, సర్పరాజ్ పల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి తోట గంగాధర్, మాజీ సర్పంచ్ దానవేని మల్లయ్య, ఉపసర్పంచ్ ఒట్టి సతీష్, సింగిల్ విండో డైరెక్టర్ కొక్కు ఎర్రన్న, బిఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు తిరుపతి, మండల రైతు సమన్వయ కమిటీ సభ్యులు కొక్కు గంగారెడ్డి, సంఘ గంగ మల్లయ్య, బిఆర్ఎస్ బూత్ కమిటీ అధ్యక్షులు ఎన్ఆర్ఐ సిమ్మల్ల మధు, సంఘ చిన్న రాజన్న, సంఘ రాజ మల్లయ్య, కొక్కు మదన్న, కొక్కు నర్సయ్య, వత్తి గంగాధర్, బండార్ మహేష్, తాలూక లక్ష్మణ్, కొక్కు రాజశేఖర్, దాసరి కొండ వెంకటేష్, బంజోజి ప్రసన్న, పాల లక్ష్మీనర్సయ్య, పాల గంగాధర్, తాలుక రాజం, బినవేని చిన్న భూమయ్య తదితరులు పాల్గొన్నారు

.