ప్రభుత్వ భూమి కబ్జాకు చేస్తున్న అధికారులు స్పందించకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు
అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్
తెలంగాణ ప్రభ (జగద్గిరిగుట్ట) కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లో 53వ బ్లాక్ దగ్గర సర్వేనెంబర్ 348 గల ప్రభుత్వ భూమిలో కబ్జా చేసి అక్రమ గదిని నిర్మాణం చేపట్టారు ఇప్పటికే రాజీవ్ గృహకల్ప లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టని కబ్జాదారులు మళ్లీ బరితెగించి ఓ గదిని నిర్మించారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ నిర్మించిన గదిని తొలగించి అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
