చైన్ స్నాచింగ్ దొంగల ముఠా అరెస్ట్

-మూడు రోజుల్లో కేసు చేదించిన పోలీసులు 

-నలుగురు అరెస్ట్ 

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి మండలంలోని రాయపట్నం శివారు పెట్రోల్ బంకు వద్దు ఈనెల 29వ తేదీన చైన్ స్నాచింగ్ కేసు లో  నలుగురు ని బుధవారం ధర్మపురి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డిఎస్పి రఘు చందర్ మాట్లాడుతూ కొందరు జల్సాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి చైన్   స్నాచింగ్ పాల్పడుతున్న నలుగురిని సీసీ  ఫుటేజీ ద్వారా అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అరెస్ట్ అయిన వారు ముఠా గా దొంగతనాలు చేస్తూ ఉంటారని అదే క్రమంలో కోరుట్ల కు సిలిగిరి సందీప్,ముంజ  రాజేందర్ లు గత నెల 29 తేదీ న రాయపట్నం గ్రామంలో   200 సిసి పల్సర్ పై దోసకాయలు అమ్ముతున్న మహిళ ను టార్గెట్ చేసి  ఆమె వద్దకు వెళ్లి  ఒకరు ద్విచక్ర వాహనం ఆన్ లో ఉంచి మరొకరు దోసకాయ లు కొనే ప్రయత్నం చేసి ఆమె మెడలోంచి 22 గ్రాముల పుస్తెలతాడు  ఒక గ్రాము పుస్తె తెంపుకొని బైక్ పై పరారైనారు. వారు 30 తేదీ  బింగల్ గ్రామానికి వెళ్లి ఈ రోజు  దానిని అమ్మేందుకు మెట్పల్లి కి చెందిన  పోతు అక్షయ్ కుమార్ అతని భార్య మాదస్తూ అలేఖ్య సహాయంతో మంచిర్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా  పోలీసులు పట్టుకున్నారు.వీరి వద్ద నుండి రెండు ద్వి చక్ర వాహనాలు,22 గ్రాముల పుస్తెల తాడు 1 గ్రాము పుస్తె 3 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. దొంగల ను పట్టుకోవటం లో చాకచక్యంగా వ్యవహరించిన ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలపాటి రాంనర్సింహరెడ్డి, ధర్మపురి సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ లు పులిచెర్ల ఉదయ్ కుమార్ ,ఉమాసాగర్,సతీష్,శ్రీధర్ రెడ్డి లను ,ఎస్పి సంప్రీత్ సింగ్, డిఎస్పీ రఘుచందర్, లు అభినందించారు. వీరికి త్వరలో రివార్డులు అందచేస్తామని తెలిపారు.

.