తెలంగాణ ప్రభ(ధర్మపురి): బుగ్గారం మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన నిరుపేద వివాహానికి బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శుభాస్ ఆర్థిక సాయం చేశారు. సిరికొండ గ్రామానికి చెందిన గుడివెందుల లక్ష్మణ్, పుష్ప దంపతుల కూతురు అశ్విని వివాహం కోసం బుధవారం వారి ఇంటికి వెళ్లి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నగునూరి నర్సాగౌడ్, కుంట మహేష్, గజ్జల విజయ్, తాండ్ర అశోక్ రావు, బాలసాని గంగన్న, సిగిరి అంజిత్, కొడిమెల రాజన్న,తాడేపు లింగన్న, సమీద్, ఆకుల శేఖర్, నక్క సత్తయ్య, సురేందర్రావు, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
